రాష్ట్రస్థాయి కరాటే పోటీల బ్రోచర్ ఆవిష్కరణ..

– కరాటే క్రీడలకు ప్రభుత్వపరంగా సహాయసహకారాలు అందిస్తాం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – వేములవాడ రూరల్
రాష్ట్రస్థాయి కరాటే పోటీల బ్రోచర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కరాటే క్రీడాలకు ప్రభుత్వపరంగా కరాటే క్రీడలకు ప్రభుత్వ పరంగా  సహాయసహకారాలు అందిస్తామని శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆన్నారు. వేములవాడ పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్ లో . వచ్చే నెల మార్చి3 తేదీన ఓకినావా స్పోర్ట్స్ కరాటే  అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కరాటే పోటీల బ్రోచర్ ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కె వసంత్ కుమార్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వపరంగా కరాటే క్రీడకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వేములవాడలో  రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రస్తుత సమాజంలో ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. .పోటీల  చీఫ్ ఆర్గనైజర్ అబ్దుల్ మన్నాన్ మాట్లాడుతూ  ఈ పోటీలకు సుమారు 600, 800 మంది క్రీడాకారులు మరియు 60 మంది ఆఫీసియల్స్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వేములవాడ సీనియర్ కరాటే మాస్టర్లు కూరగాయల శ్రీనివాస్, దండు గల తిరుపతి, లో లోపు రాజు , మానుపాటి తిరుపతి, క స రాజశేఖర్ రెడ్డి  కనికరపు రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు   ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love