గిరిజనులపై ఎస్సై దాడులను ఆపండి

– తెలంగాణ గిరిజన సంఘం
– జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాల్యా నాయక్‌

నవతెలంగాణ – పానగల్‌
మా అనుమతి లేకుండా మా ఇంట్లో తాళాలను ఎర్రగుట్టి మా దుస్తులను దశ్యం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా ఇనిపిస్తున్న 95 సంవత్సరాల వద్ధురాలు హసలి మా ఇంట్లో దాడులు నిర్వస్తున్న ఎస్సై అధికారుల జులుం ఆపాలి, బ్రతుకు తెరువు కోసం ఉపాధి కల్పించాలని గిరిజనులు వచ్చిన ఎక్సైజ్‌ అధికారులకు ముర పెట్టుకున్నారు. పానగల్‌ మండలం తెల్ల రాళ్లపల్లి తండాలో శుక్రవారం ఎస్సై అధికారులు ఉండాలపై దాడులు నిర్వహించారు గిరిజన మహిళలు వద్ధులు వికలాంగులు చూడకుండా, కనికారం చూడకుండా ఇంటి తాళాలను పలగొట్టి దుస్తులను సమగ్రని దూసం చేయడం సరైన విధానం కాదని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం.బాల్య నాయక్‌ అన్నారు. తండాలో పల గొట్టిన విషయం తెలుసుకున్న తెలంగాణ గిరిజన సంఘం బృందం తండాలో సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వద్ధులు వికలాంగులు తమ ఇంటిని పలగొట్టిన తాళాలను అన్యాయాన్ని వివరించినట్లు పేర్కొన్నారు. తండా లో 70 శాతం మంది గిరిజనులు బ్రతుకు తీరు లేక వలస వెళ్లారన్నారు. ఏ ఇంటికి చూసినా తాళాలు ఉన్నట్లు వారు వివరించారు. వలస వెళ్లిన ఇంటికి తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లను సమగ్రని పగలగొట్టడం సరైన విధానం కాదని వారు వివరించారు. ఆ గ్రామానికి చెందిన 95 సంవత్సరాల వద్ధురాలు అసలి, వికలాంగుడు భాష నాయక్‌ ఇంటిని పగలగొట్టి సమగ్రని దశ్యం చేశారని వారు ఆరోపించారు. తమ ఇంటి యజమాని అనుమతి లేకుండా ఎక్సైజ్‌ అధికారులు తాళాలు పలుగొట్టడం సరైన విధానం కాదని వాళ్లు ప్రశ్నించా రు. గిరిజల్లకు ఇలాంటి ఉపాధి లేక ఖాళీ కడుపు పెడికిలి మెతుకులు వలస వెళ్లిన గిరిజలకు ప్రభుత్వం ఉపాధి చూపడం లేదు. ఎస్టీ కార్పొరేషన్‌ నుండి వారికి ఎలాంటి సాయం అందించడం లేదు. గత ప్రభుత్వం గుడుంబా తయారు చేసే వారికి ఆర్థిక సాయం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ అందించడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ స్పందించి గుడుంబా తయారు చేసే వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బాబు నాయక్‌, మహిళా సంఘం అధ్యక్షురాలు చిట్టమ్మ, లక్ష్మి, జానమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love