ఊహల రెక్కలతో విహరించిన కథలు

Stories that fly with the wings of imaginationబాలసాహిత్యంలో బాలల ఊహాశక్తి, అభివ్యక్తి, సజనాత్మకతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పిల్లలు తమ మనసులో కలిగిన ఆలోచనలను, కలల ప్రపంచాన్ని, అనుభవాలను కథల రూపంలో వ్యక్తీకరిస్తారు. ఇది వారిలో భాషా నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా, సజనాత్మకతను, విమర్శనాత్మక ఆలోచనను అభివద్ధి చేయడంలో సహాయపడుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం నుండి 20 కిలోమీటర్ల దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తే చెరువు అనే గ్రామం వస్తుంది. ఇది కష్ణానది పరివాహక ప్రాంతానికి అతి దగ్గరగా స్వచ్ఛమైన పల్లె ప్రాంతం. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు తెలుగు భాష పై మక్కువతో, తమ ఊహాశక్తితో రాసిన కథ సంపుటి ఇది. తెలుగు సాహితీ చరిత్రలోనే ఒక మైలురాయిగా చెప్పవచ్చు.
ఆధునిక సమాజంలోని సమస్యలను పిల్లల దష్టితో అవగాహన చేసుకుని, సజనాత్మక పరిష్కారాలను ప్రతిబింబించే ‘ఊహలకు రెక్కలు’ కథా సంపుటి బాల రచయితల అద్భుత ప్రయత్నానికి నిదర్శనం. ఈ సంకలనంలోని కథలు కేవలం మనోరంజనమే కాకుండా, సామాజిక బాధ్యతా భావాన్ని పిల్లలలో పెంపొందించే ప్రయత్నంగా నిలుస్తాయి.
కుందేలు, ఏనుగు, జింక కలిసి నక్కకి గుణపాఠం నేర్పిన తీరును షేక్‌ సమీర్‌ రాసిన కథలో ‘అత్యాశ పనికిరాదు, దొరికిన దానితో తప్తి పడాలని’, జీవితంలో ఎదుర్కొనే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఖర్జూరపు సరిత ప్రత్యేకించి బాలికల విద్యావకాశాలపై దష్టి పెడుతూ, సామాజిక అసమానతలను ఎదుర్కొనే మార్గాలను సూచిస్తుంది. సతైపు సతీష్‌ రాసిన ‘ఫలించిన ఉపాయం’లో అడవిలోని జంతువులను, చెట్లను కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చాడు. మాడుగుల మహా లక్షమి రాసిన ‘ఆకుపచ్చని ఆలోచన’ కథలో రమణి అనే అమ్మాయి తన పాఠశాలలో తన పుట్టినరోజున చెట్లు నాటడం ప్రారంభించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. తమ్మిశెట్టి స్రవంతి ‘అసలైన స్నేహం’లో స్నేహం గొప్పతనం, స్నేహితుల మధ్య అనుబంధం గురించి మనసును ఆకట్టుకునే విధంగా కథను మలిచింది. ఆడేపు మణిసాహితి ‘సమయం విలువ’ గురించి తన స్నేహితురాలికి తెలియజేసిన విధానం పాఠకులను ఆకట్టుకుంటుంది. సోమగాని చంద్రతేజ ‘బతుకమ్మ సంబరాలు’ పాఠశాలలో నిర్వహించిన తీరు, తెలంగాణ సంస్కృతిని ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న విధానం ఆకట్టుకుంటుంది. పచ్చని పల్లెటూరులో పిల్లలు ప్రకతిని ఆరాధిస్తూ, పరిరక్షిస్తూ నైతిక విలువలతో విద్యను నేర్చుకోవాలనే ఉన్నతమైన ఆలోచనలతో అద్భుతమైన కథలు రచించారు. బాలసాహితీ రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయులు ముక్కామల జానకిరామ్‌ సంపాదకత్వంలో వచ్చిన ‘ఊహలకు రెక్కలొస్తే..’ సంపుటి నేటితరం విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శవంతమైనది. ఈ కథలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థినీ విద్యార్థులు కథలు, కవితలు, సంగీతం, ఆటలు, కుటుంబం, సమాజంపై అవగాహన కల్పించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పుస్తకం తెలియజేస్తుంది. ప్రతి కథలోనూ పిల్లలకు ఆలోచించే, ప్రశ్నించే సామర్థ్యాన్ని తెలియజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ పుస్తకాన్ని పిల్లలతో చర్చించడానికి ఉపయోగించవచ్చు. పిల్లల ఊహాశక్తిని ప్రేరేపించే కథలు తెలుగులో మరింత అభివద్ధి చెందాలి. చిన్న పిల్లల సజనాత్మకతను వెలికి తీయడానికి బాలల కథలు, వారి స్వంత రచనలు ఎంతో సహాయపడతాయి. బాలసాహిత్యంలో పిల్లల కథలు మరింత ప్రోత్సాహం పొందాలి, తద్వారా భవిష్యత్తులో గొప్ప కథలకు, బాల రచయితలు ప్రాణం పోస్తారు.
– పూసపాటి వేదాద్రి, 9912197694

Spread the love