మండల కేంద్రమైన లోకేశ్వరం లో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్న విద్యుత్ అధికారులు పర్యవేక్షణ కరువై వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్ వృధా అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో వీధిదీపాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయని ఆన్ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయాలంటున్నారు.