విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

– రాయపర్తి ఎస్ఐ సందీప్, ఏఓ వీరభద్రం
నవతెలంగాణ – రాయపర్తి
ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరతను సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు చూసుకోవడం జరుగుతుందని స్థానిక ఎస్ఐ సందీప్ కుమార్, వ్యవసాయ అధికారి వీరభద్రం అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు, డీలర్లతో  విత్తనాల కొనుగోలులో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ ఫర్టిలైజర్‌ దుకాణంలో తప్పనిసరిగా స్టాక్‌ బోర్డుపై అమ్మకాల వివరాలను విధిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని డీలర్లను ఆదేశించారు. స్టాక్‌ బోర్డులో పేర్కొన్న వివరాలకు అనుగుణంగా వారి దుకాణంలో నిల్వ ఉందో లేదో తనిఖీ చేయడం జరుగుతుంది అన్నారు. ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మొద్దని, నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై నిఘా ఉంటుందని తెలిపారు. తప్పు చేసే డీలర్లపై అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చెయ్యడం జరుగుతుందని హెచ్చరించారు. నిబంధలను పాటించని డీలర్లపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది వ్యాఖ్యానించారు. విత్తనాలు, ఎరువుల కొరత ఉంటే, వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అవసరం మేరకు  రైతులకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులకు నష్టం జరుగకుండా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయాలని కోరారు. పంటల సాగుకు అనుకూలమైన వాతావారణం ఉన్నందున రైతులకు అవగాహన కల్పించి మేలురకం విత్తనాలు అందించాలని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచి, రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ సదానందం, ఏఈఓలు రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Spread the love