– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్…
నవతెలంగాణ – హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న లాలిత్య అనే బాలిక అనుమానస్పదంగా మృతి చెందింది. ఈ విద్యార్ధినీ మృతిపై సమగ్రమైన విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాని కొరుతోంది. వరుసగా రాష్ట్రంలో వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలలో విద్యార్ధీనీలు చనిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వసతిగృహాలు చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని గత అనేక సంవత్సరాలు నుండి కోరుతున్న పాలకులు స్పందించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల కాలంలో పదుల సంఖ్యలో విద్యార్ధీనీ, విద్యార్ధులు చనిపోతున్న ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం చెందింది. విద్యాశాఖ మంత్రి, లేకపోవడంతో విద్యారంగాని సమీక్ష చేసి సమస్యలు పరిష్కారం చేయడం లేదు. తక్షణమే ఆశ్రమ పాఠశాలలో చనిపోయిన లాలిత్య మృతిపై సమగ్రమైన విచారణ జరిపించి, మృతురాలికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ కోరుతుంది.