ఎన్.వి. జెసి కళాశాల విద్యార్థులు విజయదుంధుభి

నవతెలంగాణ – కరీంనగర్ 
నగరంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థుల గురువారం విడుదల అయిన జె.ఇ.ఇ  మెయిన్స్ పలితాలలో ఎస్.వి. జె సి కళాశాల విద్యార్థులు బి.రాహుల్ 91.6,జి.సాథ్విక్ 90.8,షేక్ షాహిద్ 79.4, ఇ. రమ 74.1, బి.అబిలాష్ 72.2 పర్సెంటైల్థో విజయకేతనం ఎగురవేశారు. ఇందులో బాగంగా.కళాశాల యాజమాన్యం “చైర్మన్ మహిపాల్ రెడ్డి, అతిధులుగా విచ్చేసిన ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ విక్టర్ లారెన్స్ గైఫ్ని మరియు హైకోర్టు లాయర్ కావేటి శ్రీనివాస్  చేతుల మీదుగా విద్యార్థులకు వారి  తల్లితండ్రులను శాలువా మెమొంటోలథో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కళాశాల డైరెక్టర్లు, వరప్రసాద్, రాంరెడ్డి,సింహాచలం హరిక్రిష్ణ, వoగళ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొని గత పదిహేను సంవత్సరాలుగా మా ఎస్. వి. జెసి విద్యార్థులు ఇంటర్  జె. ఇ.ఇ. మెయిన్స్ లో మoచి ర్యాంకులు సాధిస్తున్నారని వారి అభివృద్ది మా ప్రధానలక్ష్యం అని విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.
Spread the love