విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలి

నవతెలంగాణ- మిరు దొడ్డి 
 మిరుదొడ్డి మండల పరిధి అందే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం గణిత శాస్త్ర శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజచార్యులు జయంతి పురస్కరించుకొని మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ డే ను నిర్వహించారు. సందర్భంగా నిర్వహించిన వివిధ ప్రతిభా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మిరుదొడ్డి ఎస్సై నరేష్ బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం విద్యార్థులకు పౌర చట్టాలు, మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకర్, మిత్ర యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love