విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి 

https://navatelangana.com/if-sold-at-high-prices-should-not-be-actions/నవతెలంగాణ – మల్హర్ రావు/మహాముత్తారం.
మహాముత్తరాం మండలంలోని కొర్లకుంట గ్రామ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 33 మంది  విద్యార్థుల భవిష్యత్తును దృష్టి అందించుకొను రాత పుస్తకాలు, కంపాస్ బాక్సులు పెన్నులు పెన్సిళ్లు రబ్బర్లు స్కేలు తదితర వస్తువులను రాజశేఖర్ సొంత రూ.10 వేల ఖర్చులతో పుస్తకాలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష అధ్యక్షత వహించగా సమన్వయకర్తగా కుసుమ కృష్ణమోహన్ వ్యవహరించారు. మండల విద్యాశాఖ అధికారి పాశం సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని మంచి దస్తూరిని కలిగి ఉండాలని దస్తూరి నోటు పుస్తకాలు రాయడం ద్వారా వస్తుందని ఉపాధ్యాయుల కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. విద్యార్థులకు ఆటపాటల ద్వారా గుణాత్మక విద్యను అందించాలని విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత విద్యావంతులుగా మారి గ్రామానికి మంచి పేరును తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ కుమార్, సమ్మయ్య, మౌనిక, స్వాతి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ బాపు తదితరులు పాల్గొన్నారు
Spread the love