వైద్య ఆరోగ్య శాఖలో ఆశ కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి ఆరోగ్య భీమా కల్పించాలి: సుదర్శన్

నవతెలంగాణ – సూర్యాపేట
గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధం గా పలు ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం గా నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలకు ,ఆరోగ్య సిబ్బందికి ఆరోగ్య భీమా వెంటనే కల్పించాలని తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ప్రభుత్వాన్ని కోరారు.ఇటివలే మృతి చెందిన ఆశ కార్యకర్త ఉదయశ్రీ మృతికి సంతాప సూచకంగా మంగళవారం స్థానిక గాంధీనగర్ లో గల ఫంక్షన్ హాల్ లో జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడారు.ప్రజరోగ్య వ్యవస్థ లో పలు రకాల వ్యాధులను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నలలో భాగంగా ఆరోగ్య సిబ్బందితో పాటు ఆశ కార్యకర్తలు పలు రకాల వ్యాధుల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చికిత్స తీసుకొనే ఆర్ధిక స్థోమత లేక చివరకు మరణాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరి బాధను అర్ధం చేసుకొని వీరికి వెంటనే ఆరోగ్య భీమా కల్పించడంతో పాటు చనిపోయిన ఆశ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్సు కల్పించడం ద్వారా పది లక్షల రూపాయలు ఎక్సగ్రాషియా ఇవ్వాలని కోరారు. అదేవిధంగా మరణించిన ఆశ కార్యకర్త ఉద్యోగాన్ని ఆమె కుటుంబంలో అర్హులైన వారికి ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ఉన్నత అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.రేఖ్య తండా నందు ఆశ కార్యకర్తగా పనిచేస్తూ గత కొన్ని సంవత్సరాలనుండి కాన్సర్ వ్యాధి తో బాధపడుతూ మరణించిన శ్రీమతి ఉదయశ్రీ  కుటుంబానికి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు.ఈ సందర్భం గా కాసారాబాద్ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తోడ్పాడుతో కొందరు వైద్యాధికారుల సహకారం తో కొంతమంది యూనియన్ నాయకులు ఇచ్చిన మొత్తాన్ని కలిపి సుమారు 60000/-రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపేణా ఆమె కుటుంబానికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆశ కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక తోడ్పాటు అందించిన కాసారబాద ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు, సిబ్బందికి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిపాలన అధికారి డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ చంద్రశేఖర్, యూనియన్ నాయకులు మేరీ నిర్మల, సుకన్య, బూతరాజు సైదులు, మేరీ, సరస్వతి తదితరులకు కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో పద్మావతి, జానీ బేగం, విజయ తదితర సిబ్బంది తో పాటు మండల ఆశ కార్యకర్తలు   పాల్గొన్నారు.
Spread the love