– గ్యాస్ లీక్‌తో ఐదుగురికి గాయాలు
– విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లో మొక్కజొన్న పంట దగ్ధం
నవతెలంగాణ-కాగజ్‌నగర్/ సారంగాపూర్/కుభీర్
వేసవి ఎండలు మండుతున్నాయి.. వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అగ్నిప్రమాదాలూ జరుగుతున్నాయి. కుమురం భీం – ఆసిఫాబాద్ జిల్లాలో ఓ హౌటల్‌లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు అంటుకుని ఐదుగురికి గాయాలయ్యాయి. అదే విధంగా నిర్మల్ జిల్లాలో పొలంలో విద్యుత్ తీగలు గాలికి ఒకదానికొకటి తాకి నిప్పులు పడటంతో మొక్కజొన్న పంట కాలిపోయింది. ఈ ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కుమురం భీం – ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గోపాల్, టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్ సంఘటనాస్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.
షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో సాయినగర్ తండాలో మంగళవారం విద్యుత్ తీగలు గాలికి ఒకదానికొకటి తాకి మంటలు చెలరేగాయి. నిప్పు రవ్వలు రైతు జాదవ్ గజానంద్ మొక్కజొన్న పైరుపై పడటంతో పంట దగ్ధమైంది.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రంగశివిని తండాకు చెందిన రాథోడ్ పిరాజీ రైతుకు చెందిన ఎద్దుపై పిడుగు పడటంతో మృత్యువాత పడింది. రోజు మాదిరిగానే వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్టుకు రెండు ఎద్దులను కట్టేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉరుములు మెరుపులు రావడంతో ఒక ఎద్దు తాడు తెంపుకొని పరిగెత్తింది. చెట్టు వద్దే ఉన్న మరో ఎద్దుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది.
వేసవి అగ్ని ప్రమాదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



