ముగిసిన వేసవి శిక్షణ శిబిరం

నవతెలంగాణ – భగత్ నగర్ : ధనగర్ వాడి ఉన్నత పాఠశాలలో అమెరికన్ ఇండియా ఫౌండేషన్ అధర్వంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది .
ఈ కార్యక్రమంలో గత నెల రోజులు గా విద్యార్థులకు స్టెమ్స్ మరియు కోడింగ్ పట్ల శిక్షణా తరగతులు నిర్వహించారు.కాగా శిక్షణ ముగింపు సందర్బంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రమోద ,ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మంకమ్మతోట ప్రధానోపాధ్యాయులు ప్రమీల,జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి , అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు శ్రుతి, అలెక్స్, మహేందర్, క్రాంతి, మహేశ్ పాల్గొన్నారు.

Spread the love