Monday, May 18, 2026
E-PAPER
Homeఆటలుటీంలో ధోని.. టాస్ గెలిచిన‌ చెన్నై సూపర్ కింగ్స్‌

టీంలో ధోని.. టాస్ గెలిచిన‌ చెన్నై సూపర్ కింగ్స్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: చెన్నై చెపాక్ స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈక్ర‌మంలో టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఆడ‌నున్నారు. అయితే పాయింట్ల పట్టిక ప‌రంగా హైద‌రాబాద్ మూడో స్థానంలో, చెన్నై ఐదు స్థానంలో ఉంది. 14 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌కు చేరువ‌లో SRH ఉన్నది. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోనుంది. లేక‌పోతే ఐదో స్థానానికి ప‌డిపోనుంది. అదే విధంగా సీఎస్కేకు 12 పాయింట్లు ఉన్నాయి. ఒక‌వేళ చెన్నై ఓడిపోతే ఆ జ‌ట్టు ప్లేఆప్ ఆశ‌లు స‌న్న‌గిల్లానున్నాయి. మ‌రోవైపు గెలిస్తే సీఎస్కే మూడో స్థానానికి వెళ్లనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -