ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందర్ నాయక్
నవతెలంగాణ-నవాబు పేట
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందర్ నాయక్ అన్నారు. సోమవారం నవాబుపేట మండల కేంద్రంలోని బంజారా భవన్ లో మండల అధ్యక్షులు సంతోష్ నాయక్, సంఘం సభ్యులతో కలిసి”ఛలో హైదరాబాద్ కరపత్రం ఆవిష్కరించారు. ఈ నెల 26 జరిగే సభకు గిరిజన ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎస్టీలకు ఇచ్చిన 12 హామీలను వెంటనే నెరవేర్చాలి.ఎస్టీలకు ప్రకటించిన మూడు కార్పొరేషన్లలో భాగంగా “సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్” ఏర్పాటు చేసి,తక్షణమే 500 కోట్లు కేటాయించాలి. గిరిజనుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ ఇచ్చిన విధంగా 6 లక్షలు మంజూరు చేయాలి. రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీలకు వెంటనే మంత్రి పదవి కేటాయించాలి, తండాల అభివృద్ధికి నూతనంగా ఏర్పడిన తండా గ్రామ పంచాయతీలకు పంచాయతీ బిల్డింగులను మంజూరు చేయాలి మరియు ప్రత్యేక గ్రాండ్స్ విడుదల చేయాలి. హక్కుల సాధనకై కదలిరండి మన గళాన్ని హైదరాబాద్ నడిబొడ్డున వినిపిద్దాం అని, తండాల ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడుకోవడానికి బంజారా సోదరులు, నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి”ఛలో హైదరాబాద్” మహా ధర్నాను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, సర్పంచులు సేవ్య నాయక్, లింబ్య నాయక్ ,జిల్లా గౌరవ అధ్యక్షులు శంకర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు తులసి రామ్ నాయక్, ఎస్టీ సెల్ జాను నాయక్, మాజీ ఎంపిటిసి రాజు,మాజీ రాములు నాయక్ , లక్ష్మణ్ నాయక్, భగవాన్ నాయక్ , ప్రధాన కార్యదర్శి మంగేష్ నాయక్,ఉపసర్పంచూలు చందర్ నాయక్,తావుర్య నాయక్, విస్లావత్ రంగా నాయక్, బాబు నాయక్, రవి నాయక్,రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



