అభివృద్ధి చేసే పార్టీని ఆదరించండి : ఎఫ్‌డీసీ చైర్మన్‌ అనిల్‌

అభివృద్ధి చేసే పార్టీని ఆదరించండి : ఎఫ్‌డీసీ చైర్మన్‌ అనిల్‌నవతెలంగాణ-హన్మకొండ
ప్రజలకు అభివద్ధి చేసే పార్టీనే ఆదరించి గెలిపిం చా లని ప్రజల మనిషి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినయ భాస్కర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై సెల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరే షన్‌ చైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం పిలుపునిచ్చారు. గురు వారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌ కుర్మాచలం మాట్లాడుతూ వివిధ రకాల ప్రచారా లు నిర్వహించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవాలనే తలం పుతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నా రు. ఓటు వేసేటువంటి ప్రతి ఒక్క ఓటరు గతంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేస్తుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వరం గల్‌ పశ్చి మ నియోజకవర్గ నాయకులు దాస్యం వినరు భాస్కర్‌ ఉద్యమ సమయం లో ఉద్యమ నాయకులుగా తమలో స్ఫూర్తి నింపాడన్నా రు. తాను ఉద్యమం చేసిన విధానం చూస్తే మాలో ఉత్సాహం వచ్చేది అని ఈ సంద ర్భంగా గుర్తు చేశారు. నా లుగుసార్లు ఎమ్మెల్యేగా గెలి పించి బీఆర్‌ఎస్‌ సత్తా, తె లంగాణ సత్తాను చాటారని అన్నారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలిపిం చాలన్నారు. ఈ తొమ్మిదిన్న ర ఏళ్లకాలంలో పశ్చిమనియోజకవర్గంలో అభివద్ధి, సంక్షే మం ఎంతో జరిగిందన్నారు. సుమారు రూ.5వేల కోట్ల నిధులతో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశార ని అన్నారు. ఈ హనుమకొండ నగరానికి చారిత్రాత్మక నేపథ్యం ఉందని, ఈ గడ్డమీద ఏం జరిగిందో అందరికీ తెలుసు అన్నారు.ఇక్కడున్నటువంటి ప్రజలు చైతన్య వం తులై ఉద్యమంలో ఎనలేని సేవ చేశారని అన్నారు. ఈ వరంగల్‌ మహానగరం ఒక ఐటీ హబ్‌ గా, ఎడ్యుకేషనల్‌ హబ్‌గా, కల్చరల్‌ హబ్‌ ఇప్పటికే అభివద్ధి చెందిందన్నా రు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సంక్షేమం,అభివద్ధి జోడెద్దుల్లాగా ముందుకు సాగుతుందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ అయిందని అన్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దా స్యం వినరు భాస్కర్‌ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ,ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని అన్నారు.వినరు భాస్కర్‌ కు రాష్ట్రమంతట అభిమానులు ఉన్నారని, ప్రజలంతా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.అన్ని రంగాలను విస్మరించిన ప్రతిపక్షాలకు ఓటు వేస్తే 50 ఏళ్లు అభివద్ధి వెనక పోతుందని అన్నారు. విజన్‌ లేని నాయకులు ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని,నవంబర్‌ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి, బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ ను చూడాలని అన్నారు.
ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి కడుదుల ర త్నాకర్‌, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ యూఎస్‌ఏ నాయకురాలు బిం దులతలు మాట్లాడుతూ ఆడపడుచులకు అండదండ గా ఉన్నటువంటి టిఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని దే శంలోనే రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్‌ కిట్టు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్‌లాంటి గొప్ప గొప్ప పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నటువంటి కెసిఆర్‌ ను మరొ క్కసారి గెలిపించుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ నాయకులు కోరబో యిన విజరు, నవీన్‌రెడ్డి, గొట్టిముక్కల సతీష్‌ రెడ్డి, శాన బోయిన రాజ్‌కుమార్‌, ప్రవీణ్‌ పంతులు, ఆకుల వినరు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love