సూర్యకుమార్‌ వచ్చేశాడు

సూర్యకుమార్‌ వచ్చేశాడుముంబయి : పొట్టి ఫార్మాట్‌లో సూపర్‌స్టార్‌, మిస్టర్‌ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. ఇటీవల బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో జరిగిన ఫిట్‌నెస్‌ పరీక్షలో సూర్యకుమార్‌ యాదవ్‌ పాసయ్యాడు. దీంతో ఐపీఎల్‌ 17లో ఆడేందుకు సూర్యకుమార్‌ యాదవ్‌కు ఎన్‌సీఏ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీ కారణంగా డిసెంబర్‌ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సూర్యకుమార్‌ శుక్రవారం తన ఐపీఎల్‌ జట్టు ముంబయి ఇండియన్స్‌ శిబిరంలో చేరాడు. సూర్య వాంఖెడే స్టేడియంలో సహచర క్రికెటర్లతో కలిసి తనదైన ట్రేడ్‌ మార్క్‌ షాట్లు ఆడుతున్న వీడియోను ముంబయి ఇండియన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆడే అవకాశం ఉంది.

Spread the love