- Advertisement -
న్యూఢిల్లీ: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మాజీ క్రికెటర్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేస్తాడని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. అయితే ఆ రికార్డును సూర్యవంశీ అధిగమిస్తాడని కుంబ్లే తెలిపాడు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్‌లో సూర్యవంశీ 53 సిక్సర్లు బాదాడు. అయితే గతంలో క్రిస్ గేల్ ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 59 సిక్సర్లు బాదాడు. ఇక ఆ సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసే అవకాశం సూర్యవంశీకి ఉన్నట్లు కుంబ్లే పేర్కొన్నారు.
- Advertisement -



