పట్టణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్

పట్టణంలో జర్నలిస్ట్ కాలనీలోని రోడ్డు నెంబర్ 10లో ఆదివారం స్వచ్చ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కాలనీ అభివృద్ధి అధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా 31వ వారం రోడ్డు నెంబర్ 10లో శ్రమదానం చేశారు. మురికి కాలువలు లేనందున మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తూ రాకపోకలకు ఇబ్బందిగా మారి స్థానికులు అవస్థపడుతున్నారు. ఈ విషయం వారు అభివృద్ధి కమిటీ దృష్టికి తీసుకురాగా, అధ్యక్షుడు గోసికొండ అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, ఇతర ప్రతినిదులు కలిసి వెంటనే పురపాలక అధికారులకు, స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్ కు చెప్పి ఆదివారం రెండు పైపులు వేయించి రోడ్డుపై మురుగు నీరు నిలువకుండా చేయించారు. ప్రోక్లేయిన్ తో పైపులు వేయించి, ట్రాక్టర్ బ్లేడుతో రోడ్డును చదును చేయించారు, ఆనంతరం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, స్థానికులు కలిసి శ్రమదానం చేసి రోడ్డుపై మొరం, కంకర వేశారు, పరిసరాల్లోని పిచ్చి మొక్కలను, పొదలను, చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సంధర్భంగా కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ వెంటనే పైపులు వేయించి సమస్య పరిష్కారానికి సహకరించిన పురపాలక అధికారులకు, సిబ్బందికి, స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్ కు కృతఙ్ఞతలు తెలిపారు. కాలనీలో అందరం ఐక్యంగా ఉంటూ అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సమస్యను వివరించిన వెంటనే  స్పందించి పరిష్కారం చేయించినందుకు స్థానికులైన ఎస్సారెస్పీ డీఈ గణేశ్, పింజ పెద్ద భోజన్న, మురళి, సురేష్ తదితరులు అభివృద్ధి కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో. కాలనీ అధ్యక్షులు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్, కాలనీ ఉపాధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి కొంతం రాజు, ఏల్ టీ కుమార్, ఎర్ర భూమయ్య, గణేశ్, పెద్ద బోజన్న, మురళి, సురేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love