మండలంలోని గ్రామాలలో ఘనంగా స్వామీ వివేకానంద జయంతి

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో  స్వామీ వివేకానంద 161వ జయంతి వేడుకలను యువకులు, రాజకీయనాయకులు  ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా కేమ్రాజ్ కల్లాలీ లో సర్పంచ్ రమేష్ దేశాయి, పెద్ద ఎడ్గిలో సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, జుక్కల్ కేంద్రంలో యువకులు, రాజకీయ నాయకులు పాల్గోని స్వామీ వివేకనంద చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను  నిర్వహించారు. ఈ సంధర్భంగా సర్పంచ్ లు మాట్లాడుతు యువత స్వామీ వివేక ఆదర్శంగా తీసుకోవాలని వారి అడుగుజాడలో  సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, యువ నాయకులు అస్పత్ వార్ ఆరుణ్, నగేష్, విఠల్, రాములు, బాబు తదితరులు పాల్గోన్నారు.

Spread the love