నవతెలంగాణ – జుక్కల్
ఆరోగ్యతెలంగాణ చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆభిమతం జహిరాబాద్ పార్లమెంట్ సబ్యుడు బిబి పాటీల్ అన్నారు. బుగువారం నాడు జుక్కల్ మండల కేంద్రంలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ఘణంగా నిర్వహించారు. ముఖ్యఅథితిగా జుక్కల్ ఎమ్మెలే హన్మంత్ షిండే. ఎంపి బిబి పాటీల్ పాల్గోని ప్రసంగించారు. ఎమ్మెలే హన్మంత్ షిండే మాట్లాడుతు తెలంగాణ వేరుబడిన తరువాత ఆసుపత్రులు నిర్మాణాలు , మండలానికోక ముప్పై పడకల ఆసుపత్రి, వైద్యశాఖలో నూతన వైద్యులకు రిక్రూట్ మెంట్ చేయడంతో పాటు ఆశాలకు జీతాలప పెంచడం జర్గింది. మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపి వారి ఆరోగ్యం పరిరక్షణకు ప్రబూత్వం ప్రత్యేక దృష్టి సారించారని పేర్కోన్నారు. ఎంపి బిబి పాటీల్ మాట్లాడుతు ముఖ్యమంతి వైద్యఆరోగ్యశాఖ దశ దిశ మార్చారని గ్రామాలలో ఆరోగ్యకేంద్రాలు, పట్టణాలలో బస్తీ దవఖానాలు, పట్టణ దవఖానాలు ఏర్పాటు చేసి సిబ్బంది నియమాకం చేసి అన్ని జబ్బులకు ఉచితంగా వైద్యఅందిచడమే కాకా మహిళలకు పౌష్టికాహరం అందించేందు అంగన్ వాడిల ద్వారా అందించడం, వైద్యపరిక్షలు , కేసిఆర్ కిట్ లను అందించడం జర్గుతుందని పేర్కోన్నారు. కార్యక్రమంలో ఎమ్మెలే , ఎంపి వైద్యసిబ్బంది తదితరులు పాల్గోన్నారు.