జిలుక విత్తనాలను సద్వినియోగం చేసుకోండి: ఏఓ కమల

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బీర్కూరు మండలం లోని దామరంచ సహకార సంఘాల నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 60% శాతం రాయితీపై పచ్చిరొట్ట ఎరువు, జీలుగ విత్తనాలను సోమవారం మండల వ్యవసాయాధికారి కమల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ప్రస్తుతము మండలములోని, మిర్జాపూర్  బీర్కూర్ సహకార సంఘం యందు 166 బస్తాలు, దామరంచ సంఘం యందు 166 బస్తాలు, అందుబాటులో సిద్ధంగా ఉన్నాయనీ ఒక్కో బస్తా 30కేజీలు బరువుతో ఉంటుందని ఈ విత్తనం రెండున్నర ఎకరాలకు సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారిని కమల తెలిపారు. ఎకరానికి జీలుగ 12కిలోలు వేసుకుంటే సరిపోతుందనీ అన్నారు.30కేజీల బస్తా రాయితీ క్రింది
పూర్తి ధర రూ.2790/-
ప్రభుత్వ రాయితీ రూ.1674/-
రైతు చెల్లించే ధర రూ.1116/-
ఈ రాయితీ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పొందటానికి రైతులు పత్రాలు.
పట్టేదారు పాసుపుస్తకం జీరాక్స్,
ఆధార్ కార్డు జిరాక్స్,
రైతు మొబైల్ నెంబర్ తీసుకొని సహకార సంఘంలో ఇచ్చి రాయితీ పై జిలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారిణి బైరాపూర్ ఏఈఓ కావ్య శ్రీ, సీఈఓ, జాకీర్ , విఠల్ ,
సొసైటీ సిబ్బంది సాయిలు, రైతులు ఆవారి రాజు, ఏనుగు పట్ల సాయిలు, గంగాధర్, మారుతి, కాజా, సత్యనారాయణ, ఆంజనేయులు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love