ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు సద్వినియోగం చేసుకోవాలి.

– జయశంకర్ పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిలి మారుతి 
నవతెలంగాణ మల్హర్ రావు
కంటి సమస్యతో బాధపడుతున్న భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల ప్రజలకు ప్రొపెసర్ జయశంకర్ పౌoడేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఉచిత కంటి పరీక్షల క్యాంపులు,అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు  నిర్వహించడం జరుగుతుందని,ఈ అవకాశాన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ అయిలి మారుతి తెలిపారు.మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు మల్హర్ రావు మండలంలో ఈ నెల 30న,కాటారం మండలంలో జూలై 7న,మహదేవ్పూర్ మండలంలో జూలై14న,పలిమెల మండలంలో జులై 21న, మహ ముత్తారం మండలంలో జులై 28న,మొగుళ్ళపల్లి మండలంలో ఆగస్టు 4న,టేకుమట్ల మండలంలో ఆగస్టు 11న,చిట్యాల మండలంలో ఆగస్టు 28న,రేగొండ మండలంలో  ఆగస్టు 25న,గోరికోత్తపల్లి మండలంలో సెప్టెంబర్ 1న,గణపురం మండలంలో సెప్టెంబర్ 8న,భూపాలపల్లి మండలంలో 25న ఉచిత క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు.క్యాంపుల అనంతరం అవసరమైన వారికి  ఆపరేషన్ కొరకు ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసి కంటి ఆపరేషన్లు పూర్తయిన తరవాత మళ్లీ ఆయా మండలాల్లో దింపడం జరుగుతుందన్నారు.కావున కంటి సమస్యలతో బాధపడే వారు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.9391075767,  7095203260.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుగ్గిళ్ల రాజ్ కుమార్ పాల్గొన్నారు.
Spread the love