నవతెలంగాణ కథనంపై పట్టణంలో చర్చ

– ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించాలి

– రూ.కోటి విలువ చేసే స్థలం కబ్జా కుట్రను బయట పెట్టినందుకు పత్రికకు, రిపోర్టర్ కు అభినందనలు
నవతెలంగాణ – అచ్చంపేట
ఆదివారం నవతెలంగాణ పత్రికలో ఈ ఆస్తికి వారసులు ఎవరు.! కోట్లు విలువ చేసే స్థలం గుడి పేరుతో కబ్జాకు యత్నం అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై పట్టణంలోని పలు  టీ హోటల్, హెయిర్ కటింగ్,  షాపులలో పలువురు చర్చించుకుంటున్నారు. స్థానిక ప్రజలు,  ప్రజాసంఘాల నాయకులు కొందరు రిపోర్టర్ కు ఫోన్ చేసి  కోట్లు విలువ చేస్తే స్థలం దేవాలయం నిర్వహణ కోసం అంటూ కొందరు కబ్జా చేసిన విషయాన్ని పట్టణ ప్రజలకు బహిర్గతం చేసినందుకు పత్రికకు అభినందనలు తెలిపారు. ఈ స్థలంలో ఉన్న గదిలో మహిళల చైతన్యం కోసం కార్యక్రమాలు నిర్వహించుకునే వారని స్థానికులు చెప్తున్నారు. అధికార బలాన్ని వినియోగించి రికార్డులు తారుమారు చేసి, గుడి పేరుతో కబ్జాకు కుట్ర చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంత బహిర్గతంగా విలువైన స్థలాలను గుడి  పేరుతో కబ్జా చేస్తుంటే, రెవెన్యూ అధికారులు , మునిసిపల్ అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రజా సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు  సబ్జా చేయడానికి  ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కబ్జాలను  బహిర్గతం చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే వంశీకృష్ణ పైన ఉంది. కోట్ల విలువైన స్థలాన్ని దేవుని పేరుతో కబ్జా చేస్తున్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే స్పందించి ఆస్తిని రక్షించి, ప్రజా ప్రయజనాల కోసం వినియోగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Spread the love