– సెంచరీతో చెలరేగిన అభినవ్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అండర్-17 వన్డే ట్రోఫీలో అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ (ఏవైసీఏ) జట్టుకు టీడీసీఏ రూరల్ జట్టు షాక్ ఇచ్చింది. వరుస విజయాల ఊపుమీదున్న ఏవైసీఏపై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. అభినవ్ గౌడ్ (143) సెంచరీతో చెలరేగటంతో టీడీసీఏ రూరల్ తొలుత 40 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. ఛేదనలో ఏవైసీఏ 49.1 ఓవర్లలో 222 పరుగులకు కుప్పకూలింది. తనూశ్ (92 నాటౌట్) పోరాడినా.. అమెరికా యూత్ జట్టుకు ఓటమి తప్పలేదు. అద్భుత ప్రదర్శన కనబరిచిన తెలంగాణ జట్టును టీడీసీఏ అధ్యక్షులు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.