రూ.12 వేల కోట్ల అప్పు తీర్చిన టీ కాంగ్రెస్..

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎంగా కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వాటిపై వడ్డీలు కట్టడానికే ప్రస్తుత ప్రభుత్వం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ‘2014లో అప్పు రూ.62వేల కోట్లుగా ఉంది. కేసీఆర్ దిగిపోయే నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. 2023 DEC 7 నుంచి 2024 JUNE 17 వరకు మా ప్రభుత్వం రూ. 25,118కోట్లు అప్పు తెచ్చింది. రూ.38,040కోట్లు అప్పు తిరిగి కట్టింది. అంటే రూ.12,922 కోట్లు అప్పు తీర్చింది’ అని స్పష్టం చేసింది.

Spread the love