ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

– పాలకులం కాదు సేవకులం అంటున్న నాయకులు
– ఉద్యమ కారులను గౌరవించి…అమరుల త్యాగాలను కీర్తిస్తూ…
– అభివృద్ధిని పట్టాలు ఎక్కిస్తామంటు బరోసా ఇస్తున్న కలెక్టర్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో వారి ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రయత్నిస్తున్నాం. అభివృద్ధిని పట్టాలెక్కిస్తూ… జిల్లాలో సాగు, తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా జిల్లాలు, మండలాలు ఏర్పడటంతో మనకు పాలన దగ్గరయ్యింది. ఏ చిన్న సమస్య అయినా పరిష్కారం చేస్తూ… ప్రజలకు సేవలు అందిస్తున్నాం అంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ జివి రవినాయక్‌, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ పి. ఉదరు కుమార్‌, వనపర్తి కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, గద్వాల జిల్లా కలెక్టర్‌ సంతోష్‌కుమార్‌, నారాయణపేట కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టర్‌ కార్యాలయాల పోలీసు ఫేరేడ్‌ గ్రౌండ్‌లో జెండావిష్కరణ చేశారు. అనంతరం తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి ఘన నివాళ్లు అర్పించారు.అందుకు పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్బంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మహోద్యమంలో పాల్గొన్న ప్రతి ఒకరికి అబినందనలు తెలిపారు. తెలంగాణప్రజల ఆశలుఆకాంక్షల అమలుకోసం ప్రజాప్రతినిధులు కంకణ బద్దులై అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు.
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తూ రైతు భరోసా, రైతుల రుణమాఫీ పథకాల అమలుతో పాటు వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ పి ఉదయ్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పీరియడ్‌ గ్రౌండ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఉదరు కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.ఈసందర్భంగా ముఖ్యఅతిథి కలెక్టర్‌ ఉదరు కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేఖరులకు, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బందికి కలెక్టర్‌ హదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డి,తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన అమరుడైన జంగం శంకర్‌ కుటుంబ సభ్యులను కలెక్టర్‌, ఎస్పీ,ఎమ్మెల్యే,అధికారులు సన్మానించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గుడిపల్లి నిరంజన్‌ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ రఘునాథ్‌ వైభవ్‌, అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన అమర వీరుల ఆకాంక్షలు, ఆశయాల సాధన దిశగా అందరం కషి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఐడీఓసీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి, అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు సంచిత్‌ గంగ్వార్‌ తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయంతో అయితే ఏర్పడిందో ఆ దిశగా మనందరం కషి చేసి ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం, ఆర్థిక ఫలాలు అందించే విధంగా రాష్ట్ర అభివద్ధి కోసం కషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు నా ఆశీస్సులు అందజేస్తూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని తెలియజేస్తూ కలెక్టర్‌ ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో ఎస్పీ రక్షిత కే మూర్తి, అదనపు కలెక్టర్‌ సంచి త్‌ గంగ్వార్‌, జడ్పీ చైర్మన్‌ లోక్‌ నాథ్‌ రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ పుట్టపాకుల మహేష్‌, ఎంపీపీ కిచ్చారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఓ భాను ప్రకాష్‌, ఆర్డివో పద్మావతి, జడ్పీ సీఈఓ యాదయ్య, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్‌, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌ నగర్‌: తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల దినోత్సవ వేడుకలను మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఎన్నికల నిబంధన మేరకు అధికారులు ఈ వేడుకలు నిర్వహించారు.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రం లో అర్‌డ్‌బీ అతిథి గహం వద్ద ఉన్న అమర వీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ,శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి,మహబూబ్‌ నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఆబ్జర్వర్‌ ఏ.వాణి ప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ జి. రవి నాయక్‌, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, జోన్‌-7 జోగులాంబ కార్యాలయం నందు తెలంగాణ అవతరణ దినోత్సవం సంద్భంగా జాతీయ జెండా ఆవిష్క రణ చేసిన జోన్‌-7 జోగులాంబ డి ఐ జి ఎల్‌. ఏస్‌. చౌహాన్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయం కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌, మున్సిపల్‌ కార్యాలయం దగ్గర చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, వివిధ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఆయ శాఖల అధికారులు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల దగ్గర జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్రవసర్న శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్‌ నగర్‌: సీఎం రేవంత్‌ రెడ్డి నేతత్వంలోని ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు సముచితస్థానం ఉంటుందని డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమా రౌడ్‌ అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం ఆవరణలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలు నిర్వహించారు. చంద్రకుమార్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌, ఏపీ మిథున్‌ రెడ్డి , జిల్లా మీడియా సెల్‌ కన్వీనర్‌ సీజే బెనహర్‌, సీనియర్‌ నాయకులు ఎస్పీ.వెంకటేశ్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వసంత, జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ అధ్యక్షులు రాజేశ్వర్‌ రెడ్డి, నాయకులు బెక్కరి అనిత, ఆన్వర్‌ పాషా, లక్ష్మణ్‌ యాదవ్‌, అజ్మత్‌అలీ, నయీమోద్దీన్‌, ఆవేజ్‌, చంద్రశేఖర్‌, సుభాష్‌ ఖత్రి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై త్రవర్ణ పతాకాన్ని ఆయా శాఖల అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.పోలీస్‌ స్టేషన్పై ఎస్సై తిరుపాలజీ. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పై ఉపాధ్యక్షులు ప్రతాప్‌. వ్యవసాయ శాఖ కార్యాలయం పై శాఖ నిర్వాహకుడు ప్రశాంత్‌ రెడ్డి. గ్రంథాలయ శాఖపై నిర్వాహకులు లలితమ్మ .మండల అభివద్ధి కార్యాలయం పై ఎంపీపీ కమల. మండల మహిళా సమాఖ్య కార్యాలయం పై ఏపిఎం నాగరాజు. ఈజీఎస్‌ వద్ద రాజశేఖర్‌ రెడ్డి. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జడ్పిటిసి జరుపల కళ్యాణి ,మండల తహసీల్దార్‌ కార్యాలయం పై అధికారి శ్రీనివాస్‌ రెడ్డి వివరణ పథకాన్ని ఆవిష్కరించారు. మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు శంకర్‌ నాయక్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంఘం నాయకులు లక్ష్మణ్‌ నాయక్‌, మండల కాంగ్రెస్‌ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, కేసర్‌ వెంకటరెడ్డి, దత్తాత్రేయ .రఫిక్‌ ,మాజీ ఎంపీపీ యాదగిరి గౌడ్‌,జగన్‌ నాయక్‌ పాల్గొన్నారు.
క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ నటరాజ్‌ ఆధ్వర్యంలో ..
రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసింది ఇవాళ అర్పించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ నటరాజ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్యాముల్‌ అన్నారు.అనంతరం స్టేట్‌ బాడీ మెంబర్‌ రమణయ్య ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ లో జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో కోశాధికారి జగపతిరావు, ఈసీ మెంబర్‌ ఉమేష్‌ మల్లేష్‌ , రెడ్‌ క్రాస్‌ మేనేజర్‌ నరసింహ, బ్లడ్‌బ్యాంకు అడ్మినిఆఫీసర్‌లత,అనాధాశ్రమం సూపర్డెంట్‌ వెంకటేశ్వరమ్మ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్‌: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలు తెలంగాణ ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎంపీడీవో కార్యాలయం పై ఎంపీటీ సుదర్శన్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. తహసీల్దార్‌ కార్యాలయంపై తహసీల్దార్‌ రాజు నాయక్‌, వ్యవసాయ కార్యాల యం పై ఏవో సిద్ధార్థ, మహిళా సమైక్య కార్యాలంపై ఏపీఎం రాందాస్‌ నాయక్‌, పిఎసిఎస్‌ కార్యాలయంపై చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, పోలీస్‌ స్టేషన్లో ఎస్సై ఆనంద్‌,ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ శివకాంత్‌, గ్రామపంచాయతీలలో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాలను ఎగరవేశారు.కార్యక్రమంలో జడ్పీటీసీ శశిరేఖబాలు, మిడ్జిల్‌ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్‌ గౌస్‌ ,ఎంపీ ఓ అనురాధ, మండల గిర్దవరి, మండల శాఖ అధికారులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
మహమ్మదాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం. మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు,పాఠశాలలు,పంచాయతీ కార్యాలయంలో మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంపై తహసీల్దార్‌ తిరుపతయ్య, పోలీస్‌ స్టేషన్‌ పై ఎస్‌ఐ శేఖర్‌ రెడ్డిలు జాతీయ జెండాను ఎగరవేశారు.కార్యక్రమంలో డిప్యూటీ చంద్రశేఖర్‌,ఆర్‌ఐ యాదయ్య,సర్వేర్‌ ణుగోపాల్‌,మాజీ పిఎసీఎస్‌ చైర్మన్‌ కమ్మతం శ్రీనివాస్‌ రెడ్డి,మాజీ పిఎసిఎస్సి చైర్మన్‌ కమతం విష్ణువర్ధన్‌ రెడ్డి,శాంతి రంగ్య,సీనియర్‌ అసిస్టెంట్‌ శివశంకర్‌,విజయలక్ష్మి,వేణు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love