గుడ్‌న్యూస్‌..సరికొత్త పథకాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తునున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా, కుటుంబానికి భరోసాగా ఆర్థికపరమైన పథకాలను తీసుకువస్తున్నది. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, దళితుల సంక్షేమం కోసం దళితబంధు, బీసీ కులవృత్తుల కోసం బీసీబంధును అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎరుకల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. రూ.60కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది. ట్రైకార్‌ ద్వారా సాధికారత పథకాన్ని అమలు చేయనున్నది. పందుల పెంపకం సొసైటీలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పందుల పెంపకం, స్లాటర్‌ హౌస్‌, కోల్డ్‌ స్టోరేజీలకు, రవాణా, ఫోర్క్‌ రిటైల్‌ మార్కెట్ల ఏర్పాటు కోసం ఆర్థిక సాయం చేయనున్నది. యూనిట్‌కు గరిష్ఠంగా రూ.30లక్షల వరకు 50శాతం రాయితీ ఇవ్వనున్నది. 40శాతం బ్యాంకు రుణం, మరో 10శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. పథకం మంజూరు కోసం జిల్లాస్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ పని చేయనుండగా.. ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ రాష్ట్రస్థాయిలో పథకం అమలును పర్యవేక్షించనున్నది.

Spread the love