ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండల కేంద్రంలో ఆదివారం రోజున కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పగంగా రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులందరూ పాలాభిషేకం చేశారు తర్వాత మండల అధ్యక్షుడు సాయి రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి ఒకరినొకరు మిఠాయిలు పoచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ప్రజల ఆశీర్వాదాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అసలు సిసలైన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో మన ఉద్యమకారుడు మరియు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత భూపతిరెడ్డి సారధ్యంలో రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పయనంలో నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజలు అని రంగాల్లో నష్టపోయారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ప్రభుత్వంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మనమందరం ఘనంగా నిర్వహించుకుంటున్నామని, గత తొమ్మిది ఏళ్లకు భిన్నంగా ఈ వేడుకలనీ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే  మన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని, ముఖ్యంగా రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వ ఆదుకుంటుందని ఇప్పటికే ఆరు గ్యారెంటీలకు ఐదు గ్యారంటీలు అమలు చేసి తీరామని, ఆగస్టు 15 తేదీలో కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని చెప్పిందే చేస్తుందని చేసేది చెప్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడి నేటికి పది సంవత్సరాలు గడిచిందని ఈ పది సంవత్సరాల వేడుకను మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని ఎంతోమంది అమరుల త్యాగాలను ఈ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోలేదని వారి కుటుంబాలకు కచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో యువకుల పాత్ర కీలకమని గత ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా మోసం చేసిందని కానీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని కచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేసి తీరుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, వైస్ ఎంపీపీ అనిత ప్రతాప్, మాజీ జెడ్పిటిసి మోహన్ నాయక్, ఎన్ డిసిసి బ్యాంక్ డైరెక్టర్ లింగన్న, మోపాల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, న్యాల్కల్ మాజీ సర్పంచ్ గంగా ప్రసాద్, తిరుపతి, సాయినాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ రావు, రవి, సాయి కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love