
– రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్
– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పథంలో తెలంగాణ నెంబర్ వన్ లో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్ లో ఆదివారం జరిగే కెసిఆర్ సభ ఏర్పాటు ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగునీటి కోసం ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఇంటింటికి మంచినీరు మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నామని అన్నారు. రేపటి ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైందని, గులాబీదండు లక్షలాదిగా తరలివచ్చి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను ఆశీర్వదించనున్నారన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు అన్ని గ్రామాల నుండి మహిళలు, నాయకులు, అభిమానులు ప్రజలు తరలివస్తారని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. గ్రామాలలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజా సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తాయని అన్నారు. మూడవసారి హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్క,చెల్లెలు, అన్నదమ్ములు, యువత, ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించాలని సతీష్ కుమార్ కోరారు.