– టియూఎఫ్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్
– సిఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులతో విన్నపం
నవతెలంగాణ మల్హర్ రావు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ మండల కేంద్రమైన తాడిచెర్ల లో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య ఆధ్వర్యంలో టియూఎఫ్ ఫోరం నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులను పోస్టు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం తలపెట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా నాయకులు తాడిచెర్ల పోస్టుపీస్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు వేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్ మాట్లాడాతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేలు ఫించన్ ఇవ్వాలన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల బడ్జెట్ కెటాయించాలని ఉచిత బస్సు, ట్రైన్ పాసులివ్వాలన్నారు. గత ప్రభుత్వం ఉద్యమ కారులను విస్మరించిందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మానిఫేస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మానిఫేస్టో కమిటీ చైర్మన్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఇతర క్యాబినెట్ మంత్రులు చొరవ తీసుకుని హామీలను వెంటనే నెరవేర్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి బోయిని రాజయ్య యాదవ్, మండల అధ్యక్షులు బూడిద సతీష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, నాయకులు కోండ్ర సారయ్య, బడితెల వెంకటస్వామి, కోట చంద్రమౌళి గౌడ్, అవిర్నేని పురుషోత్తం రావు, ఆకుల సదానందం, గట్టయ్య, జునగరి పద్మ, ముద్దుల విజయ, కుర్రి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.