Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ అభివృద్ధి 
దేశానికే దిక్సూచి

తెలంగాణ అభివృద్ధి 
దేశానికే దిక్సూచి

- Advertisement -

​వెయ్యి రోజులు తెలంగాణ 
ప్రగతికి కొత్త దిశ : వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలలో తెలంగాణ ప్రగతి కొత్త దిశలో వెళుతోందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని తెలిపారు. వెయ్యి రోజుల్లో రైతు సంక్షేమం, పేదల భరోసా, యువతకు ఉద్యోగాలు, విద్య, సామాజిక న్యాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ, రైతు భరోసా పెంపు, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. 1000 రోజులు ఒక మైలురాయి మాత్రమేనని.. ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో మరింత వేగంగా పనిచేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -