
– డారు రవికుమార్ డిమాండ్.. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
తిని కాకు టెండర్లను వెంటనే పూర్తి చేసి 50 ఆకుల కట్టకు నాలుగు రూపాయలు చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం రత్నం రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో వేసవిలో తునికాకు సేకరణ గిరిజనులకు రెండవ పంటగా ఉన్నది. ఈ సంవత్సరము జిల్లాలో తునికాకు టెండర్లు ప్రక్రియ రాష్ట్ర అటవీశాఖ ప్రభుత్వము ఇంతవరకు పూర్తి చేయలేదు . వెంటనే తునికాకు టెండర్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2016 నుండి 2021 వరకు తునికాకు బోనస్ 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసింది . అయినా ఇంతవరకు బోనసు తునికాకు కూలీలకు అందలేదు. కొందరికి రెండు సంవత్సరాలు బోనస్ మాత్రమే బ్యాంకులో జమయింది . ఒక్కొక్కట్టకు మూడు రూపాయలు లెక్క బోనస్ వస్తే ఒక్కొక్క కుటుంబానికి 50,000 నుండి లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ బోనస్ కూలీలకు అందలేదు వెంటనే సమ్మక్క సారక్క మేడారం జాతరలోపు తునికాకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు వెంటనే ప్రభుత్వం తునికాకు ప్రక్రియ చేపట్టాలని బోనస్ మంజూరు చేయాలని లేనియెడల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకట్ రెడ్డి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బిరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, ఎండి అంజాద్ భాష, జిల్లా కమిటీ సభ్యులు వంక రాములు, గొంది రాజేష్, పొదిల్ల చిట్టిబాబు, పేదం రమాదేవి, ఎండిగపూర్ పాషా, దుగ్గి చిరంజీవి తదితరులు పాల్గొన్నన్నారు.