రాజ్యాంగాన్ని మారుస్తానన్న మోడీ ప్రకటనను తక్షణమే మానుకోవాలి: తాళ్లపల్లి లక్ష్మణ్

నవతెలంగాణ – ఆర్మూర్ 

రాజ్యాంగాన్ని మారుస్తాని మోడీ బీజేపీ చేస్తున్న ప్రకటన తక్షణమే మానుకోకపోతే దళితుల సహనన్ని పరీక్షించడమే అవుతుందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి లక్ష్మన్ అన్నారు.  పట్టణంలోని మిలన్ ఫంక్షన్ హల్ లో ఆదివారం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి లక్ష్మన్ హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కి మాత్రమే పాటుపడాలని  వీడిసి అడ్డం పెట్టుకుని  ఇస్టనునుసారంగా కుల భాహిష్కరణల పేరుతో ఆగడాలు మిత్తిమీరుతున్నాయని తక్షణమే వాటిని ప్రభుత్వాలు ఉక్కుపాదం తో అణచివేయాలని అయన కోరారు.. ఈ సందర్బంగా డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు కంజార భూమన్న రాజన్న మాదరి నరేష్ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల పై అనేకరకాలుగా దాడులకు తెగబడుతున్న బీజేపీ ని ఎదిరించాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు ఏకం కావాలని రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన డి హెచ్ పి ఎస్ సంఘాన్ని బలోపేతానికి కృషి చేస్తానని మాదరి నరేష్ అన్నారు.. ఈ కార్యక్రమంలో.ముత్యాలు.లక్ష్మి నర్సయ్య.ముప్పారపు రాజా శేఖర్.సోమా శీను. ఆరెపల్లి సాయిలు.తదితరులు పాల్గొన్నారు.
Spread the love