
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ గౌడ సంఘం ప్రెసిడెంట్గా తాళ్లపల్లి శశికాంత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం గౌడ సంఘం సభ్యులందరూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌడ సంఘం ఉపాధ్యక్షుడిగా పొన్నం పరశురాములు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా వెంగలి దేవయ్య గౌడ్, కోశాధికారిగా ఎదురుగట్ల రాజేశం గౌడ్ లను ఎన్నుకున్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి, గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని, తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.