హీరో మాధవన్‌కు ధన్యవాదాలు

– టీసేఫ్‌ యాప్‌ను ఎక్స్‌ ఖాతాలో ప్రచారం చేయడం బాగుంది : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్‌ రెడ్డి మార్చి 12 2024లో ప్రారంభించిన టీ సేఫ్‌ యాప్‌ను సినీ హీరో మాధవన్‌ తన ఎక్స్‌ ఖాతాలో ప్రచార నిమిత్తం ట్వీట్‌ చేయడాన్ని మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) అభినందించారు. అమ్మాయిలు, మహిళలు ఆ యాప్‌ను వినియోగించాలనీ సూచించారు. మరింతగా ఈ యాప్‌ను వినియోగంలోకి తెచ్చేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సీతక్కతో బచ్‌పన్‌ బచావో అందోళన్‌ బృందం భేటీ
పిల్లల హక్కుల కోసం నోబెల్‌ గ్రహీత కైలాష్‌ సత్యార్థి నేతృత్వంలో పనిచేస్తున్న బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ ఎగ్జిక్యూటివ్‌ బృందం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క)తో బుధవారం సచివాలయంలో భేటీ అయ్యింది. ఆ బృందంలో ఆ సంస్థ డైరెక్టర్లు సంపూర్ణ బెహరా, ధనంజరు తింగాల్‌, ప్రతినిధులు వీఎస్‌. శుక్లా, చందన, వెంకటేశ్వర్లు, తదితరులున్నారు. బాల కార్మికులు, బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ఆ సంస్థ పనిచేస్తున్నది. బాలల హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రతినిధులు అభినందించారు.

Spread the love