పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

– జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ రమేష్ చంద్ర
నవతెలంగాణ-ఉప్పునుంతల :
వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వకర్త డాక్టర్ రమేష్ చంద్ర అన్నారు.మంగళవారం ఉప్పునుంతల సిహెచ్సి ఆస్పత్రిలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తారసింగ్, డాక్టర్ ప్రభు లతో కలిసి పది మందికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాడర్ స్ట్రేంత్ శాంక్షన్ అయితే వైద్యులు మరియు సిబ్బంది వచ్చే అవకాశం ఉందన్నారు.అప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలతో పాటు అన్ని రకాల శస్త్ర చికిత్సలు ఇక్కడే చెయ్యటం జరుగుతుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారదని ఆయన హెచ్చరించారు. అదే విదంగా ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ బికులాల్ ,డాక్టర్ రమాకాంత్ , ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, స్టాఫ్ నర్స్ ఉఫ్ఫత్,వెంకటమ్మ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love