మండలంలో ఘణంగా ఎడ్ల పోలాల అమావాస్య పండుగ..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలో గురువారం నాడు రైతులు ఎడ్ల పోలాల అమావాస్య పండుగను ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉదయం నుండి రైతులు పంట పోలాల పనులకు దున్నేందుకు ఉపయేాగించే ఎడ్లను స్నానాలు చేయించి అందంగా రంగులు వేసి ముస్తాబు చేస్తారు. నేటి రోజు ఎపవంటి పనులు కూడా చేయించరు. అదేవిధంగా సాయంకాలం గ్రామ కూడలీలోని ముఖ్యమైన అంజనేయస్వామీ మందిరాల వద్ద బాజాబజంత్రిలతో చుట్టు ప్రదక్షణలు చేయించి, వరుడికి చేసినట్టు అలంకరణ చేసి ఆవుతో మంత్రఉచ్చరణలతో వివాహమహోత్సవం నిర్వహించి, అథితిలకు పిండి వంటకాలతో సహపంక్తి బోజనాలు చేయడం  జర్గుతుంది. అలా మండలంలో గ్రామాలలో ఎడ్లపోలాల అమావాస్య పండుగను ఘణంగా రైతన్నలు నిర్వహించారు.
Spread the love