ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు

నవతెలంగాణ – సిద్దిపేట : తెలంగాణలోని ఆడపడుచులకు అతి ముఖ్యమైన బతుకమ్మ పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు మహిళలు తీరోక్కపూలతో బతుకమ్మలను పేర్చి,  వాటి చుట్టూ లయబద్ధంగా పాటలు పాడుతూ, ఆటలు ఆడుతారు. గౌరమ్మ లను తయారు చేసి బతుకమ్మలో ఉంచి ఆటలు ఆడుతారు. అనంతరం చెరువులలో నిమజ్జనం చేస్తారు. మహిళలు అక్కడికి తెచ్చుకున్న ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు. గౌరమ్మలను పూసుకుంటారు. చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని మున్సిపల్ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.
Spread the love