జిల్లాలోనే ఉత్తమ పాఠశాల బోర్గం( పి) పరిషత్ ఉన్నత పాఠశాల..

నవతెలంగాణ – మోపాల్

నిజామాబాద్ జిల్లాలోని ఉత్తమ పాఠశాలగా బోర్గo (పి) జిల్లా పరిషత్ పాఠశాల నిలిచింది. ఈ పాఠశాల మరో ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్రంలోను ఐదవ స్థానంలో ఉంది. ఈ పాఠశాలలో చదువుకోవడం  కోసం పోటీ తత్వం ఉంటుందంటే అర్థం చేసుకోవాలి ఈ పాఠశాలలో చదువుతోపాటు క్రమశిక్షణ మరియు ఆటపాటలతో విద్యార్థినీ విద్యార్థులు ముందు ఉంటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో బూర్గం జిల్లా పరిషత్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల  ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు సరైన విద్యాబోధన ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం కూడా చాలా నాణ్యతతో ఉంటుంది. ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుంది. ఈ పాఠశాలలకు సమీపంలో అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నా కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ధనవంతుల పిల్లల్ని కూడా ఈ పాఠశాలలో చదివిస్తున్నారు అంటే ఈ పాఠశాల ఎంత ప్రత్యేకతమో అర్థం చేసుకోవాలి. ఈ పాఠశాలలో మొత్తం బాల బాలికలు కలిపి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు 941 విద్యార్థిని విద్యార్థులు కలరు. మొన్న విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో దాదాపు 90% ఉత్తీర్ణత సాధించారు. అలాగే 10/10 ఒకరికి, 9.8 ముగ్గురికి, అలాగే 9.5 ముగ్గురు విద్యార్థులకు రావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో చాలా ప్రభుత్వ స్కూలు మూతపడుతుంటే ఈ స్కూలు మాత్రమే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు రావడం జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా డిజిటల్ క్లాసులను కూడా నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా ఈ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల తో పాట ఉపాధ్యాయులు కూడా సరైన సమయంలో పాఠశాలకు వస్తారు. సమయపాలన పాటించడంలో ఈ పాఠశాల తర్వాతే మరి ఎక్కడైనా,  ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద 22 లక్షలతో పాఠశాల మరమ్మతులు కూడా చేయించడం జరిగింది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో కూడా ఆటల్లో ముందున్నారు. ఈ పాఠశాలలో 24 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ పదిమంది డిప్యూటేషన్ పైన ఉన్నారు మొత్తం 34 మంది ఉపాధ్యాయులు ఉన్నారు కాకపోతే కొంతవరకు ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత మాత్రం ఉంది రాష్ట్ర ప్రభుత్వం గానీ జిల్లా యంత్రాంగం కానీ ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్.భూపతిరెడ్డి ఇంకొక పదిమంది ఉపాధ్యాయులను ఈ పాఠశాల కేటాయిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఇంతకుముందు చదివిన ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ గ్రూప్ వన్ లాంటి క్యాడర్ పోస్టుల్లో కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఉత్తీర్ణతతో కానీ అన్ని రకాలుగా ముందు స్థాయిలో ఉందంటే ప్రత్యేకంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సి హెచ్ శంకర్ కృషి ఎనలేనిది, ఇటువంటి ప్రధానోపాధ్యాయుడు ప్రతి పాఠశాలకు ఉంటే ఆ పాఠశాలలు కూడా ఎంతో పురోగతిని సాధిస్తాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శంకర్ మాట్లాడుతూ కచ్చితంగా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో లక్షలు వేల రూపాయలు ఖర్చుపెట్టకుండా కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు చదివి కచ్చితంగా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని కచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఉంటుందని ఆయన తెలిపారు.
Spread the love