పుస్తకం – ప్రాశస్త్యం

మారవచ్చునేమో స్వరూపం కానీ, చెక్కుచెదరనిది పుస్తకం
జ్ఞాన సముపార్జనకు ఏకైక సాధనం.
ఒక స్నేహితుడితో సమానం
అనుభవాలను నేర్చి జీవితంలో మార్పును తెస్తుంది ఒక మంచి పుస్తకం.
పుస్తక పఠనం కల్గించు మానసిక ఉల్లాసం..
కలుగును శారీరక ఆరోగ్యం ఒత్తిడి నుండి విముక్తిని ప్రసాదించు సాధనం..
వార్తలకు పత్రిక రూప సమాహారం.
సమ సమాజ నిర్మాణానికి కషి చేసిన రచనలకు రూపం..
సాహిత్య పిపాసుల కవి, కవయిత్రుల కవనాలకు కవితలుగా సాక్ష్యం.
కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు, రచనలు, వింతలువిశేషాలతో
అన్నింటి మేలు కలియికల సమాహారం విజ్ఞాన భండాగారం..
గురువుగా మనలో నింపు జ్ఞానోదయం.
శాస్త్ర, సాంకేతిక అంశాలకు సష్టి రహస్యాలకు ప్రతిబింబం..
జీవన ఉపాధికి ఆలంబనం లక్ష్యాన్ని దరిచేర్చే మార్గదర్శకం.
అలోచనలకు నిలయం ఆశయాలకు ఆలయం
మనలో తొలగించు అజ్ఞానం వెలుగు రూపంలో పంచు విజ్ఞానం.
అందుకే ప్రపంచ పాఠకులారా పుస్తకాన్ని కొందాం, కొనిపిద్దాం..!
నేటి కాలంలో కనుమరుగు అవుతున్న పుస్తకాన్ని బ్రతికించుకుందాం..!!
– ఎన్‌.రాజేష్‌, 9849335757

Spread the love