కూలిన బిల్డింగ్ బాల్కనీ..ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : కూకట్పల్లి ముసాపేట్లో తృటిలో ముగ్గరు పిల్లలకు ప్రమాదం తప్పింది. పాత ఇంటి బాల్కానీ కూలి ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఏమి లేదని వైద్యులు చెప్పడంతో పిల్లలు తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకున్నారు.

Spread the love