న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో నటుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి కొంత దూరం నడిచారు. ‘భారత్ జోడో యాత్ర’కు ఈ మేరకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఇప్పటికే పలువురు నటులు, ప్రముఖులు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 3,000 కిలోమీటర్ల దూరం కవర్ అయ్యింది. మరో 12 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగి జనవరి చివర్లో జమ్ముకశ్మీర్‌లో ముగియనున్నది.