కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

– కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ డిమాండ్.
నవతెలంగాణ – భువనగిరి
ఎన్నికల మేనిఫెస్టో హామీలను   కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరిలోని రైతు సంఘం కార్యాలయంలో  తెలంగాణ రైతు సంఘం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ మూడు లక్షల రుణము కౌలు రైతులతో సహా ఎకరాకు రూ. 15 వేల రైతు భరోసాగా ఇస్తామని అన్నారని అన్నారు. భూమి లేని వారికి  రూ. 12 వేలు సంవత్సరానికి రాయితీగా ప్రకటించారు అని అన్నారు పంటల భీమా పథకంతో పాటు నకిలీ విత్తనాలు క్రిమిసంహారక మందుల వ్యాపారం చేసే వారిపై పీడీ యాక్ట్ తో పాటు ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటించారని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన మద్దతు ధరలకు తోడుగా బోనసులు చెల్లిస్తామని హామీ ఇచ్చారని అన్నారు అసైన్డ్ భూముల పునరుద్ధరణ భూసేకరణలో పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములకు కూడా సమాన ధర చెల్లిస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారన్నారు పాలకు లీటరుకు ఐదు రూపాయలు ప్రోత్సాహకము. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు కోతులు అడవి పందులు నివారణకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మంగ నర్సింహులు చీరిక అలివేల జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి పోశెట్టి రేకల శ్రీశైలం చీరిక సంజీవరెడ్డి సుదగాని సత్య రాజయ్య, కోటరామచంద్రారెడ్డి,  జిట్ట అంజి రెడ్డి, కేసి రెడ్డి యాదవ రెడ్డి, ,పొట్ట శ్రీనివాస్, గన్నే బోయిన భాస్కర్ , పాల్గొన్నారు
Spread the love