Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది

- Advertisement -

– సీఎం రిలీఫ్ ఫండ్.. నిరుపేదలకు వరం..
– మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి..
నవతెలంగాణ – ఊరుకొండ 

కష్టాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని.. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వైద్యం అందించడం వరమని మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని జకినాలపల్లి గ్రామానికి చెందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 

మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పోలే బంగారమ్మకు రూ.25,000/-, బొల్లు జంగయ్యకు రూ.36,000/-, ముచర్ల సరితకు రూ.54,000/-, లింగమయ్యకు రూ.29,500/-, చాంద్ పాషాకు రూ.26,000/-, పోలే బాలమైసయ్యకు రూ.36,000/-, కమ్మపాటి రాజ్యలక్ష్మికి రూ.60,000/-, వెంకటయ్యకు రూ.20,000/-.. మొత్తం 2,86,500/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలే చంద్రయ్యలే చేతుల మీదుగా అందజేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ వహించిన స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి మరియు సహాయ సహకారానికి అండగా నిలిచిన జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డిలకు గ్రామ ప్రజలు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జకినాలపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -