Sunday, August 9, 2026
E-PAPER
Homeఖమ్మంగ్రామీణ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్న మోడీ ప్రభుత్వం

గ్రామీణ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్న మోడీ ప్రభుత్వం

- Advertisement -

– రేపు ‘జైల్ భరో’ను జయప్రదం చేయండి
– ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు జాజిరి జ్యోతి
నవతెలంగాణ – సత్తుపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ సభ్యురాలు జాజిరి జ్యోతి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు (సోమవారం) 10వ తేదీన నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం తుంబూరు గ్రామంలో ముత్తిని శ్రీను అధ్యక్షతన ప్రజాసంఘాల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జ్యోతి మాట్లాడుతూ… కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు.

గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కొత్త బిల్లుల పేరుతో బలహీనపరిచి, పని అవకాశాలను తగ్గించే చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను వివసించి 4 లేబర్ కోడ్‌లుగా తీసుకురావడం ద్వారా వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం అనుసరిస్తున్న ఈ విధానాలను తిప్పికొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు జరిగే  నిర్వహించే ‘జైల్ భరో’లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఐద్వా నాయకురాళ్లు వాసం నాగేశ్వరి, గార్లపాటి విజయ, ప్రజా సంఘాల నాయకులు ముత్తిని కృష్ణ, షేక్ బాబు షరీఫ్, బండి విస్తరయ్య, పొగడ్త కన్నయ్య, వాసం రమేష్, పైళ్ళ చిట్టెమ్మ, ముత్తిని సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -