నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండల కేంద్రంలో బుధవారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి తదితరులను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్ తదితరులు మంత్రులకు పూల బోకేలు అందజేసి, శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, మండల అధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కేతావత్ హీరాసింగ్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్లు చేగూరి వెంకటేష్, డాక్టర్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రాంచందర్ నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పోతుగంటి అశోక్, రామకృష్ణ, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎఖ్బాల్ పాషా, సేవాదళ్ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్లు పోతుగంటి శంకర్, వేణు పంతులు, శేఖర్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ జహంగీర్ బాబా, నాయకులు జవాహార్ లాల్ నాయక్, హన్మా నాయక్, మల్లేష్ గౌడ్, తులసి రామ్ నాయక్, గూడూరు భాస్కర్ రెడ్డి, జహంగీర్ అలి తదితరులు పాల్గొన్నారు.