బీసీ సునామీ పార్టీ అభ్యర్థి గా చీకటి భూపాల్ గౌడ్ ను గెలిపించాలి

– బీసీ సునామి పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు పంజాల యాకందర్ గౌడ్
నవతెలంగాణ- తొర్రూర్: పాలకుర్తి బీసీ సునామీ పార్టీ అభ్యర్థిగా చీకటి భూపాల్ గౌడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అఖిలభారత వెనుకబడిన ప్రజల సునామి పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు పంజాల యాకేందర్ గౌడ్ అన్నారు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ బీసీల ఐక్యతతో రాజ్యాధికారం చేపట్టే దిశగా బీసీల కోసం భూపాల గౌడ్ పార్టీని స్థాపించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారని గురువారం రోజు పాలకుర్తిలో నామినేషన్ వేయడానికి వస్తున్నారని ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గం లో గౌడ, గొల్ల కురుమలు, పద్మశాలీలు అత్యధికంగా ఉన్నారని బీసీలు బీసీ నాయకులు కోసం మన రాజ్యాధికారం కోసం భూపాల్ గౌడ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.. రాష్ట్రంలో దేశంలో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా వెనుకబడి అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మలుగా మారారని అన్నారు. ఓబీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని తెలిపారు. ప్రధాన పార్టీలు బీసీలను ఓటర్లుగానే చూస్తున్నాయనే తప్ప వారికి జనాభా దామాషా ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం లేదన్నారు. జనాభాలో బీసీల వాటా అత్యధికమని, ఆ ప్రజల సహకారంతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు వారి ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు.వెనుకబడిన తరగతులకు అధికారం, ఆత్మగౌరవం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం అత్యంత వెనుకబడిన తరగతుల ప్రజల సునామీ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. బీసీల రాజకీయ చైతన్యం కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యం లో ఉన్న పార్టీలు బీసీలను అణగదొక్కుతున్నాయని దుయ్యబట్టారు.. బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. రాజకీయాల్లో, సమాజంలో మార్పు కోసం ఓబీసీలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్క శ్రీనివాస్, బొమ్మెర ఎల్లా గౌడ్, చిర్ర ఎల్లయ్య, పంజాల సాయి, కోలా యాకయ్య, పంజాల లక్ష్మీనారాయణ, మహేందర్, నంద నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love