స్కిల్ యూనివర్శిటీలో ప్రవేశాలకు గడువు తేదీ పొడగించాలి

The deadline for admissions in Skill University should be extended– నేటితో ముగియనున్న గడువు –
– పని చెయ్యని హెల్ప్‌ లైన్ నెంబర్
– మైనార్టీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ
రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యం పెంచి,మెరుగైన అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ’ లో అందిస్తున్న పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవటానికి గడువు తేదీని నెల రోజుల పాటు పొడిగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ మరియ ఇ-కామర్స్ వంటి విభాగాల్లో పలు కోర్సులను అందిస్తున్నందున ఈ యొక్క కోర్సులో ప్రవేశాలకు యువతకు అవగాహన లేని కారణంగా అధికారులు కూడా ప్రచారం నిర్వహించనందున, యూనివర్సిటీ వారు ఇచ్చిన హెల్ప్ లైన్ నంబరు కూడా పని చేయని కారణంగా అనేక మంది అర్హులైన విద్యార్ధులు ప్రవేశాలు పొందలేక నష్ట పోయే అవకాశం ఉన్నదని, ప్రభుత్వం వెంటనే స్పందించి గడువు తేదీని ఒక నెల రోజుల పాటు పొడిగించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్న పలు కోర్సుల పట్ల అధికారుల అవగాహన కల్పించాలని కోరారు.

Spread the love