సీఎం రేవంత్ రెడ్డికి డెడ్ లైన్.. పక్షపాత ధోరణిపై దీక్షకు సిద్ధం

నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి బుధవారం బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పైలెట్ ప్రాజెక్ట్ భాగంగా ద్వారా నిర్మించనన్నట్లు ప్రభుత్వం తెల్పడంపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి  ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బుధవారం నాడు లేఖ రాశారు. ఇంటిగ్రేెడ్ పాఠశాల ఆర్మూర్ లో పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మించాలని వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తెలుపని పక్షంలో ఆర్మూర్ నియోజకవర్గంలో దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి కోసం అవసరం అయితే ఎక్కడి వరకు అయిన పోరాటానికి సిద్దం అని లేఖలో పేర్కొన్నారు.
Spread the love