దేశ రక్షణే ఊపిరిగా పోరాడుతున్న సైనికులు

దేశ రక్షణే ఊపిరిగా పోరాడుతున్న సైనికులు– మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌
నవతెలంగాణ-నస్పూర్‌
దేశ రక్షణే ఊపిరిగా తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు చేస్తున్న త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. 25వ కార్గిల్‌ విజరు దివస్‌ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎ.సి.పి. ప్రకాష్‌, సి.ఐ. బన్సీలాల్‌ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్రమంగా దేశంలోకి చొరబడిన వారితో ఆర్మీ అధికారులు, సైనికులు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని, కార్గిల్‌ ఘటన ప్రతి భారతీయుడిలో చెరగని ముద్ర వేసిందని అన్నారు. కార్గిల్‌ భూభాగంలోకి 1999 మే నెలలో ఉగ్రవాదులు చొరబడగా దాదాపు రెండున్నర నెలల పాటు అలుపెరుగని పోరాటం చేసి జూలై 26, 1999న కార్గిల్కు విముక్తి కల్పించారని, ఈ పోరాటంలో ఎందరో ఆర్మీ అధికారులు, సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను తణప్రాయంగా తాగ్యం చేశారని, వీరి త్యాగాలు ఎన్నటికీ చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love